Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస నాయకులు కనకయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఎన్నో ఏళ్ళుగా కార్మికులు, కర్షకులు శ్రమతో నిర్మితం అయిన ప్రభుత్వం వనరులను నేటి ప్రజా వ్యతిరేక పాలకులు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని ఏఐఏడబ్ల్యుయు అనుబంధ వ్యవసాయ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య అన్నారు. ప్రజా ధనంతో, కార్మికులు కష్టార్జితంలో ఏర్పాటు అయిన భారత్ సంచార నిఘం లిమిటెడ్ను జియో కంపెనీకి కట్టబెట్టడం మే దీనికి మంచి ఉదాహరణ అని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న తలపెట్టిన ఛలో ఢిల్లీ జయ ప్రధానికి అయి ఏర్పాటు చేసిన సదస్సును, స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో సోమవారం ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యుయు, సీఐటీయూ అనుబంధ రైతు, వ్యవసాయ కార్మిక, శ్రామిక సంఘాల మండల కమిటీలు ఆధ్వర్యంలో ఈ సంఘాల మండల కమిటీ బాధ్యులు ముల్లగిరి గంగరాజు, గడ్డం సత్యనారాయణ, కేసుపాక నరసింహారావుల అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య హాజరై ప్రసంగించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం నిర్వీర్యం చేయడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. అనంతరం రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ గిట్టుబాటు ధర నిర్ణయించకుండా రైతును దివాలా తీసే విధంగా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.జే రమేష్ మాట్లాడుతూ కార్మిక కోడ్లు పేరుతో చట్టాలను మార్చడం శ్రామిక శక్తిని దోచుకోవడానికి, పారిశ్రామిక వేత్తలకు మేలు చేయడానికి ఉపయోగపడతాయని అన్నారు.
వ్యకాస జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, బి.చిరంజీవిలు తదితరులు పాల్గొన్నారు.