Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా కరకట్ట నిర్మాణాల కోసం రెండవసారి భూసేకరణ పై సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ అనుదీప్‌కు రైతులు వినతి పత్రం అందజేశారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు చర్ల, దుమ్ముగూడెం మండలాల భూనిర్వాసితుల సంఘం అధ్యక్షులు కొమరం దామోదర్‌రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రెండవ సారి భూసేకరణ కనీసం రైతులకు సమాచారం కూడా ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఎకరాకు 30 లక్షల రూపాయలు చెల్లించాలని, వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరు మళ్లింపు విషయంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారో తెలపాలన్నారు. మిగులు భూములకు సాగునీరు అందించే విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రాజెక్టు డిపిఆర్ ప్రజల ముందు ఉంచాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నిర్వాసిత రైతులు తుష్టి కామరాజు, పొడియం బొజ్జి, కోండ్రు లవేందర్, సిహెచ్ మిత్ర, పొడియం లలిత తదితరులు ఉన్నారు.