Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు
ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరించిన కలెక్టర్
- చర్యలకు అధికారులకు సిఫార్సులు
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ మార్గదర్శకాలమేరకే ఇల్లు లేని నిరుపేదలకు రెండు పడక గదులు ఉచితంగా ఇస్తున్నామని, ఏ భైరవకారుడుకి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. సోమవారం పాల్వంచలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఆయనే మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో అనర్హులకు ఇల్లు మంజూరు చేశారని వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ స్పందిస్తూ ఎక్కువ ఆదాయం ఇల్లు ఉన్నవారు ఉంటే వివరాలు అందజేయాలని, విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు పడక గదులు కేటాయింపుకు ఎవరైనా డబ్బులు అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రెండు పడక గదులు ఇండ్ల కేటాయింపులకు వచ్చిన దరఖాస్తుల ప్రకారం లబ్బిదారుల సమక్షంలో వీడియోగ్రఫీ నడుమ లాటరీ నిర్వహించడం జరిగిందని చెప్పారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు వివరాలు చూస్తే పెనుపాక మండలం ఏలూరులో బయ్యారం గ్రామానికి చెందిన దడిగల బుచ్చయ్య తన తల్లి దరిగల కనకమ్మ అమ్మవారిని అధీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నానని ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఆర్డీవోకు సిఫార్సు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 20 వార్డుకు చెందిన ప్రజలు వార్డుల్లో సీసీ రోడ్లు సగం వరకు వేసి ఆపేశారని దానివల్ల మురుగునీరు ఇండ్లలోకి వస్తున్నాయని వాసన భరించలేకపోతున్నామని సీసీ రోడ్లు సిసి డ్రైన్లు నిర్మించాలని కోరారు. దీంతో మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులకు చర్యలు నిమిత్తం ఎండార్స్ చేశారు. వివిధ మండలాల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణి సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారికకు
కృషి చేయాలి : కలెక్టర్
పాల్వంచ : మహిళా సాధికారికకు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహి ళల సాధికారిక హక్కులు అవకాశాలు కల్పించడం స్త్రీ, పురుష అసమనతలు మహిళపై హింస దాడులతో పాటు ప్రభావితం చేసే అంశాలకు దూరంగా ఉంటామని ఎలాంటి పక్షపాతాలను ప్రభావితం చేయడం గానీ ప్రద ర్శించకుండా సమానత్వాన్ని చాటుతామని ప్రతిజ్ఞ చేపి ంచారు. మహిళలు చేస్తున్న సేవల పట్ల సోదరా భావం కలి గి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఇదే అంశాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కలెక్టర్ సంతకం చేశారు. మహిళా శిశు సంక్షేమ అధికారి లేనిన, జడ్పీ సీఈవో విద్యులత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఇంటర్మీడియట్ అధికారిని సులోచన రాణి, ఎస్పీ అభివృద్ధి అధికారి అనసూర్య, సర్వే సహాయక సంచాలకులు కుసుమాకుమారి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.