Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండి రమేష్
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
బిజెపి, ఆర్ఎస్ఎస్ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ కోరారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సోమవారం సిపిఎం ఖమ్మంరూరల్ మండల కమిటీ సమావేశం కారుమంచి గురవయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో బండి రమేష్ మాట్లాడుతూ కులాల, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి ప్రజలను రెచ్చగొడుతూ విభజించి పాలిస్తున్న బిజెపి విధానాలను ప్రజలకు తెలిపేందుకు, ప్రజలను చైతన్య పరచాలని ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాత్ర ఈనెల 23న మండలంలోని ఎం.వెంకటాయపాలెం గ్రామానికి విచ్చేస్తుందని, అక్కడ జరిగే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు, అభ్యుదయవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్ రెడ్డిలు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పేదల పొట్ట కొట్టి,పెద్దల జేబులు నింపేందుకు శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. బిజెపి అధికారం చేపట్టాక దేశంలో పేదల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు నందిగామ కృష్ణ, యామిని ఉపేందర్, పెండ్యాల సుమతి, వై.ప్రసాదరావు, భూక్య నాగేశ్వరరావు, వడ్లమూడి నాగేశ్వరరావు, రామయ్య, గాయత్రి, రంజాన్ పాషా, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.