Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాడ వాడలా సంబరాలు
నవతెలంగాణ-మణుగూరు
రంగురంగుల కేలి రంగోలి హౌలీ సంబరాలను వాడ వాడాల ప్రజలు నిర్వహించుకున్నారు. సింగరేణి అధికారులు ఇల్లందు క్లబ్లో అధికారులు, మహిళా అధికారులు, సింగరేణి కుటుంబ సభ్యులు తమ తమ స్థాయిని మరిచి సంతోషాలతో హౌలీ నిర్వహించుకున్నారు. జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, ఏజీఎం డి.నాగేశ్వరరావు, ఎస్ ఫోర్ టు జీఎం లలిత్ కుమార్, పీకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస చారి, ప్రధాన అధికారులు తదితరులు పాల్గొని హౌలీ నిర్వహించుకున్నారు. మున్సిపాలిటీ, మండలంలో యువతీ, యువకులు మహిళలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హౌలీ నిర్వహించుకున్నారు. విప్ రేగా కాంతారావు క్యాంప్ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. డీఎస్పి రాఘవేంద్రరావు, సీఐ ముత్యం రమేష్ కుమార్, సిబ్బంది రేగా కాంతారావు కలిసి హౌలీ శుభాకాంక్షలు తెలిపారు.
హౌలీ వేడుకలలో విప్ రేగా
మణుగూరు ప్రపంచంలో అన్ని రంగులు కలిసి ఉంటేనే ప్రకృతి ఎంతో అందంగా ఉంటుందని, అదే విధంగాదేశంలో అన్ని రకాల మతాలు కలిసి ఉంటే దేశం మరింత అందంగా ఉంటుందని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం హౌళీ పండుగ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజనవిభాగం నాయకులు, పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హౌలీ వేడుకలలో ఆయన పాల్గోన్నారు. రాష్ట్రం, జిల్లా, పినపాక నియోజకవర్గ ప్రజలకు హౌలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలు
పాల్వంచ : కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ దంపతులు పేషీ సిబ్బందితో కలిసి హౌలీ వేడుకల్లో పాల్గొన్నారు.
పినపాక : పినపాకలో హోలీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో మంగళవారం హౌలీ నిర్వహిస్తుండగా మరికొన్ని ప్రాంతాలలో బుధవారం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నారు. కాముని దహనం కార్యక్రమం ఈ.బయ్యారం యాదవ బజార్లో నిర్వహించారు. హౌలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై నాగుల్ మీరాఖాన్ ఆధ్వర్యంలో గోదావరి పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మల్లారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సూర్య హౌలీ వేడుకల్లో పాల్గొన్నారు.
కొత్తగూడెం హోలీ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ పారిశుధ్య కార్మికులతో సంబురాలు జరుపుకున్నారు. మంగళవారం మున్సిపాలిటీ రామవరం 6వార్డులో చైర్పర్సన్ నివాసం వద్ద హౌలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా లక్ష్మీ మాట్లాడుతూ చిన్నా, పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా నిర్వహించే హౌలీ సంబరాలు పారిశుధ్య కార్మికులతో కలిసి నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి భర్త, టీబీజీకేఎస్ 11 మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ, బిఆర్ఎస్ నాయకులు దొమ్మేటి నాగేశ్వరరావు, మజీద్, శ్రీను, వేణు, నాగేశ్వరరావు, రమేష్, రాజేష్, శివ, నాగ వేణు, వెంకటేశ్వర్లు, పంటయ్య, శేఖర్, షరీఫ్, జినీత్, బన్ను, పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.