Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం నాయకులు జలగం హేమమాలిని
నవతెలంగాణ-పాల్వంచ
ఇంటిని చక్కబెట్టే మహిళ సమాజాన్ని కూడా చక్కదిద్దుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళ విభాగ నాయకురాలు జలగం హేమమాలిని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నవతెలంగాణతో ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితం అనేది మూడు పేజీల పుస్తకం మొదటిది పుట్టుక చివరి పేజీ మరణం ఈ రెండు మన చేతుల్లో లేవు. దైవానుగ్రహం మధ్యలో ఉన్న పేజీ ఒక్కటే మన చేతిలో ఉంటుంది. మహిళా లోకం యువత మంచి భవిష్యత్తు కోసం పాటు పడాల్సిన అవసరం ఉంది. శ్రీవాదం అంటూ ప్రకృతి సిద్ధంగా మహిళలకు సిద్ధించిన మాతృత్వాన్ని అమ్మపాలు స్వచ్ఛతను కుటు ంబ వాతావరణన్ని కలుషితం చేయొద్దు. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమే. ఒకరి కన్నా మరొకరు ఎక్కువ కాదు. శ్రీవాదంపై పోరాటం కలిగినప్పుడే వాస్తవ మాణిక్యంగా మానవత్వం ప్రదర్శిస్తుందని చెప్పారు. అప్పుడే స్త్రీ, పురుష సమానత్వం వెళ్లి విరుస్తుంద న్నారు. మారుతున్న సమాజంలో నేటికీ మహిళలపై జరుగుతున్న వివక్షతను ముందుగా వీడాలి. నిర్భయాలు కాకుండా మహిళలు నిద్రలేవాలి, ఆచరణలో హక్కులను సాధించుకోవాలి. రిజర్వేషన్లు అమలు చేసుకోవాలి. ప్రతి మహిళ కృషి చేయాలి. సమాజంలో చట్టాలు బాధ్యతలు హక్కులపై మహిళలు అవగాహన పెంచుకొని జాగ్రత్తలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.