Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రామిక మహిళ ధరావత్ రమణ
నవతెలంగాణ-మణుగూరు
బాటలు వేశావు, కొండలు తొలిచావు, డ్యాములు కట్టావు ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది దాశరధి గీతాన్ని నిజం చేస్తూ విజయ పదంలో దూసుకుపోతుంది శ్రామిక మహిళ ధారావత్ రమణ. తన భర్త సుధాకర్ సహకారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 మందికి ఉపాధి కల్పిస్తూ నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ శ్రామిక మహిళలగా బ్రిక్స్ కంపెనీ నిర్వహిస్తున్న ధరావత్ రమణతో నవతెలంగాణ ఉమెన్స్ డే ప్రత్యేక స్పెషల్... నువ్వు మహిళవు చదువు రాదు నీకెందుకు వ్యాపారం హేలన చేశారు. అయినా మొక్కవోని దీక్షతో తన భర్త సహకారంతో పరిశ్రమ స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శ మహిళగా ప్రశంసలు పొందుతుంది. చిన్నతనంలో తల్లితోపాటు సివిల్ కాంట్రాక్ట్ పనులకు పర్యవేక్షణ, కూలీలను మాట్లాడడం మెటీరియల్ కొనుగోలు చేయడం లాంటి పనులు చేసేది. నాడే వ్యాపార ఆలోచన మనసులో పడింది. బ్రిక్స్ కంపెనీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించుకున్న రమణకు చేతి సాయం, మాట సహాయం తగ్గలేదు మూడేళ్లు శ్రమించి బ్యాంకు రుణం పొందాను. పనులు ప్రారంభించుటకు సిద్ధమవుతుండగా లాక్ డౌన్ ఏర్పడింది. నీరసపడకుండా వేచి ఉండి రామానుజవరంలో ఎకరం భూమిని లేజుకు తీసుకొని ఫ్లై యాస్ బ్రీక్స్ పరిశ్రమ ప్రారంభించాను. స్వయంగా గుజరాత్లోని మోర్బికి వెళ్లి యంత్రాలు కొనుగోలు చేశాను. కేటీపీఎస్ బారాజలం బీటీపీఎస్ వంటి పరిశ్రమల నుండి యాష్ తీసుకొస్తున్నాము. ప్లాంట్లో నెలకు 3.5 లక్షల ఇటికలు తయారు చేస్తున్నారు. 75 వేల ఆదాయం లభిస్తుంది. తనతో పాటు అనేక కుటుంబాలు ఆధారపడి ఈ పరిశ్రమ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం పరిసర ప్రాంతాలకు ఇటుకను సరఫరా చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రామిక మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.