Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిత్కారం నుండి ప్రశంసల వరకు
- పోటీ ప్రపంచంలో ఎదురీతలు
- పాటిబండ్ల నీరజ
నవతెలంగాణ-మణుగూరు
మహిళల మనోభావాలను అర్థం చేసుకోలేని సమాజం చిత్కరించింది, భర్త వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు నాపై అబండాలు వేశారు. ఆడపిల్ల పుట్టిందని పుట్టింట్లో వివక్షత గురయ్యాను. అమ్మమ్మ ఇంట్లో తాత సూరపనేని రామారావు, మేనమామ సూరపనేని జనార్ధన్ వామపక్ష భావజాలానికి ప్రభావతమైనాను. 10 మందికి సహాయం చేయాలనే గుణం సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో వ్యాపార రంగంలో అడుగు పెట్టింది పాటిబండ్ల నీరజ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాటల్లో...పట్టణంలో భువన స్వీట్స్ స్వగృహ ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో హారిక మెస్, కర్రీ పాయింట్ క్యాటరింగ్లో రాణిస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందుతూ బిజినెస్ నిర్వహిస్తున్నా. భర్త చిట్టిబాబుకు వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం పసిగట్టను తన కారణంగానే భర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. భర్త చనిపోయిన అనంతరం చిల్లి గవ్వ కూడా సమయంలో మొదట శారీస్పై పెయింటింగ్ రోలింగ్ అమ్మడ్ వంటి పనులు ఒంటరిగానే నిర్వహించా. ఆ క్షణంలో పని కావాలంటూ మరో మహిళ నాకు తోడైంది. ప్రముఖ పత్రికలలో అడ్వర్టైజ్మెంట్ల వలన ప్రభావితమై హైదరాబాదులోని కెఎంకె క్యాటరింగ్ మురళీకృష్ణ ద్వారా అప్పడాలు, మినుముల వడియాలు పూలు తయారుచేస్తూ పదిమంది మహిళలకు ఉపాధి కల్పించాను. జూన్ నెలలో వ్యాపారం బలహీనంగా ఉంటుంది కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకున్న దానిని అప్పడం, పూల వడియాలు, చల్ల మిర్చి తదితర వంటకాలు తయారుచేసి విజేత సూపర్ మార్కెట్ ద్వారా 17 ఏజెన్సులకు స్వీట్స్ హౌమ్ ఫుడ్స్ సరఫరా చేసాము. 2010 నుండి స్వీట్స్ షాప్ ఓపెన్ చేసి పరోక్షంగా ప్రత్యక్షంగా 25 మందికి ఉపాధి కల్పిస్తూ 2017 నుండి స్వీట్స్ కర్రీ పాయింట్ క్యాటరింగ్ హౌటల్ నిర్వహిస్తూ సంవత్సరానికి సుమారు 8 లక్షల టర్నోవర్ చేస్తున్నాను. పెరుగుతున్న ధరల కారణంగా వ్యాపారం నిర్వహించడం పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడం ఇబ్బందికరంగానే ఉంది. లాక్ డౌన్ తర్వాత బిజినెస్ దెబ్బ తిన్నది. ఒక బిజినెస్ డౌన్ కావడంతో మరో బిజినెస్ ప్రారంభిస్తూ ముందుకు సాగుతున్నాను. కార్మికులకు పనిలేదని వెనక్కి పంపకుండా నా దగ్గర ఉంచుకొని కష్ట సమయాలలో భోజనం ఏర్పాటు చేస్తూ ఉపాధి కల్పిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.