Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలు రకాల సేవలను వేగంగా, సులభంగా అందించాలానే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసిందని అయితే వీటిపై పర్యవేక్షణ కొరవ అవ్వడంతో లక్ష్యం నీరు గారిపోతుందని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు దుబ్బ గోవర్ధన్ మండిపడ్డారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్లో ఆయన ఆ సంఘం ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన డబ్బులు కంటే కూడా ప్రజల దగ్గర నుండి నిర్వాహకులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నేతలు మడివి రమేష్, ఈసం భవతి తదితరులు పాల్గొన్నారు.