Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులు, నెలలు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్న...ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా మహిళలపై వివక్ష మాత్రం తొలగడం లేదు. చట్టాలున్నప్పటికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నప్పటికీ మహిళలపై ఏదో ఒక ప్రాంతంలో నిత్యం వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఆర్భాటంగా జరుపుకుంటున్న వేడుకలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 112 సార్లు మహిళా దినోత్సవ నిర్వహించుకున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మహిళల పరిస్థితి మారింది.
- స్వప్నం సాకారమాయ్యేనా
- హక్కులు ఉన్నా అన్నీ చిక్కులే
- నేడే అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నవతెలంగాణ-పాల్వంచ
ఆకాశంలో సగమైన మహిళలపై నేటి వివక్షత తొలగడం లేదు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు రూపొందించిన అమలులో నిర్లక్ష్యం అవగాహన రాయిత్యం ఫలితంగా అలంకారప్రాయంగా మిగులుతున్నాయి. చిరకాల స్వప్నమైన చట్టసభల్లో మహిళలు 33 శాతం రిజర్వే షన్ బిల్లు ఆచరణలో అమలు కావడం లేదు. ఇంట, బయట ఎన్నో రకాలుగా మానసిక శారీరక సమస్యలు ఎదు ర్కొంటూ మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తూ అన్ని రంగాల్లో మహిళా కబలా కాదు సభల అని నిరూపిస్తూ మహిళా సాధికారతపై నేటి సమాజంలో మహిళ మండుతున్న అగ్నిగుండంలా మారుతుంది. స్త్రీ అంటే కేవలం వంటింటికే పరిమితమనే విధంగా పురుషాధిక్య ప్రపంచం భావిస్తుంది. కానీ మారుతున్న కాలమాన పరిస్థి తులకు అనుగుణంగా మహిళల్లో జాగృతం వికసించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పొలం పనులు దగ్గర్నుంచి కంప్యూటర్ ఆపరేటర్ వరకు పరిశ్రమల్లో పురుషులతో సమానంగా రాత్రి, పగలు శ్రమిస్తున్న కష్టానికి తగిన ఫలితం లభించడం లేదు. కట్టుబొట్టు ఆచారాలతో వేరుచేసి చిన్నచూపు చూసే పరిస్థితి నేటి సమాజంలో దాపరించింది. దుర్భరమైన పరిస్థితులు నుంచి విముక్తి పొందేందుకు ఎందరో మహిళలు జాతిపై పోరు సలిపిన సాధికారత సహకారం కాక మహిళల వేదన అరణ్య రోదనంగా మారిందని పలువురు మహిళలు వాపోతున్నారు. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు దోపిడీలు వివక్షలపై పురుషల్పి చైతన్యవంతమైన పురుషులతో సమానంగా జీవించే అవసరమైన స్వప్నం కోసం హక్కుల సాధన కోసం ఈ మహిళా దినోత్సవం తోనైనా నాంది పలకాలని ఆశిద్దాం.