Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఉద్యమకారురాలు గుండ్ల తులసమ్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
స్త్రీలు ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకున్నప్పడే వారికి నిజమైన స్వేచ్చ వచ్చినట్లు అవుతుందని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట యోధురాలు, 90ఏండ్ల గుండ్ల తులసమ్మ అభిప్రాయపడ్డారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం నవతెలంగాణతో మాట్లాడారు. మాతరం నుండి.. ఈ తరం మహిళల వరకు అనేక రకాల వివక్షకు గురవుతున్న తీరును చూస్తున్నాను. అనేక రంగాల్లో రానిస్తున్నారు. ఆకాశంలో వంటింటి కుందేలు అనే మహిళలు నేడు అంతరిక్షంలోకి వెళి తిరిగి వస్తున్న రోజుల్లో కూడా దాడులు, వివక్ష, అనచి వేత, చిన్నచూపు లాంటివి వెంటాడుతున్నాయి. మహిళలు చిన్నతనం నుండే ప్రశ్నించే తత్వం, ఆర్ధిక స్వావలంబన, పట్టుదలను పెంచుకోవాలి. ముఖ్యంగా విద్య ద్వారనే మన ఉన్నతిని మనం ప్రపంచానికి చాటుకోగలం. మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.