Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో మహిళలు మానసికంగా ఎంత దృఢంగా ఉంటారో...శారీరకంగా అనేక రుగ్మ్రతలను ఎదుర్కోంటుంటారు. ఎక్కువ మంది స్త్రీలు తెలియని ఆనారోగ్య ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సందర్భాలలో తీవ్రంగా మారి క్యాన్సర్‌కి దారి తీసే ప్రమాదాలు ఉన్నాయి. ఎక్కువ మంది మహిళలు క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారు. ఇది చాల బాధాకరం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేడియాలజీ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సెంటర్లు ఏర్పాటు వలన స్త్రీలకు ఎదురయ్యె అనేక ఆరోగ్య సమస్యలను చిన్న చిన్న పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించి తొలి దశలోనే చికిత్సలు నిర్వహించేందు శ్రీకారం చుట్టడాన్ని చూస్తే....ఇది మహిళలకు ఆరోగ్యప్రదాయనిగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టర్ ప్రారంభించనున్నారు.
- క్యాన్సర్ నిర్ధారణ కోసం రేడియాలజీ హబ్
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య సేవలు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర్ంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రేడియాలజీ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్ ఏర్పాటు మహిళలకు వరంగా భావిస్తున్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్న ప్రభుత్వం జిల్లాలో మహిళల కోసం ఐదు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని పర్ణశాల, మోరంపల్లి బంజర, పెనగడప, కొమరారం, ఎర్రగుంటలోని పీహెచ్‌సీలను మహిళా ఆరోగ్య కేంద్రాలుగా మార్చనున్నారు. ఈ సెంటర్స్‌లో ప్రత్యేకంగా మహిళా డాక్టర్స్ ఉంటారు. ఆయా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అనుపత్రికి వచ్చే మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తారు. సమస్య ఉంటే కొత్తగూడెంలోని రేడియాలజీ హబ్‌కు రిఫర్చేస్తారు. ఈ హబ్‌లో సీటి స్కానింగ్, మోమోగ్రామ్, టూడీఏకో లాంటి పరికరాల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు దరిచేరకుండా క్యాన్సర్ పరీక్షలకు గాను మోమోగ్రామ్ పరికరాన్ని వినియోగించి అధునాతన పద్దతిలో వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తారు. జిల్లా కేంద్రంలో రేడియాలజీ హబ్ ద్వారా ఆరోగ్యసేవలు అందించేందుకు సిద్దం చేశారు. ఈ హబ్ సెంటర్స్‌లో ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. తొలి దశలోనే వ్యాధులు గుర్తించి వాటికి పూర్తి స్థాయి చికిత్సలు అందజేయనున్నారు. దీని ద్వారా క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను గుర్తించి తొలి దశలోనే చికిత్సలు మొదలు పెట్టడం జరుగుతుంది. రేడియాలజీ హబ్ ద్వారా మహిళలు ఇక ముందు దీర్ఘకాల వ్యాధుల బారిన పడకుండా స్వస్తి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.