Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభద్రతాభావంలో మహిళలు
- బీటీపీఎస్ ఎస్ఈ అడ్మినిస్ట్రేటివ్ పార్వతి
నవతెలంగాణ-మణుగూరు
ఇల్లును చక్కబెట్టడంలోనూ బయట ప్రపంచంలో అన్ని రంగాలలో మహిళలే ముందున్నప్పటికీ నేటి ఆధునిక సమాజంలో మహిళలు అభద్రత భావంతో జీవనం కొనసాగిస్తున్నారని బీటీపీఎస్ ఎస్ఈ పార్వతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నవతెలంగాణతో ఆసక్తికర విషయాలు చర్చించారు. స్వేచ్చలేని సమాజంలో బతకలేక డాక్టర్ ప్రీతి నాయక్ బలైపోయింది అన్నారు. ఉన్నత చదువులు చదువుతున్న మహిళలు కూడా వివక్షత గురవుతున్నారు. అడుగు బయట పెడితే చాలు ఎన్నో సవాళ్లు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. కడుపులో ఉన్నప్పుడు కత్తిరింపులు బయటపడి బడికి పోతుంటే చిదరింపులు నేటి మహిళలు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్లో మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా విధులు నిర్వహిస్తూ విద్యుత్ ఉత్పత్తిలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.