Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ కోలాట నృత్య కళాకారిని బేర శ్రీలక్ష్మి
నవతెలంగాణ-పాల్వంచ
అవని నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. మహిళలు సర్వతో ముఖాభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రముఖ కోలాట నృత్య కళాకారిని, సావిత్రిబాయి పూలే అవార్డు, లేడీ లెజెండ్ అవార్డు గ్రహీత, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు గ్రహీత, నేషనల్ కళారత్నా, నాట్య మయూరి అవార్డు, నంది అవార్డు గోల్డెన్ స్టార్ అవార్డు, స్ఫూర్తి రత్నా అవార్డు, నేషనల్ ఆట అవార్డు గ్రహీత డాక్టర్ బేర శ్రీలక్ష్మి అన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. జనాభాలో 50శాతం ఉన్న మహిళలు అస్థాయిలో అవకాశాలను అధికారాలను అందుకోవడం లేదన్నారు. 1977లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మహిళా దినోత్సవ వాస్తవ లక్షణం శ్రామిక ఉద్యమంగా మొదలైన మహిళా దినోత్సవం నేడు సామాజిక ఆర్థిక రంగాలలో మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకొని వేడుకలు చేసుకొనే రోజుగా మారింది. మహిళా సాధికారత అంటే ఒక్క స్త్రీ తనకు తానుగా సొంత నిర్ణయం తీసుకునేలా ఎదగడం సమాజంలో కానీ, కుటుంబవంలో, విద్యా విషయంలో, తను ఎంచుకున్న రంగంలో కానీ తనకు అంటు తాను ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండాలి. ఎంపవర్మెంట్ చదువు, మంచి చెడూ అన్ని తెలిసి ఉండాలి. ఇవి అన్నీ కావాలి అంటే ముఖ్యంగా ఫిజికల్ అండ్ మెటల్ హెల్త్ కావాలి స్త్రీ అంటే ఆదిశక్తి స్త్రీ అంటే ప్రకృతి అలాంటి స్త్రీ మూర్తి పైన రోజు రోజుకి ఆకృత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. మహిళల రక్షణ విషయంలో చట్టాలు కఠిచర్యల తీసుకోవాలి నిర్భయ, దిశ చట్టాలు వంటి కఠినచట్టాలు పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి మహిళలకు భద్రతను కల్పించాలన్నారు. చట్టాలలో పార్లమెంట్లో మహిళలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ప్రతి మహిళా తెలుసుకోవాలన్నారు. చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలనే డిమాండ్ ఏనాటి నుండో ఉంది. కానీ బిల్లు రూపం నుండి చట్టరూపం దాల్చడం లేదన్నారు. ఇప్పటికీ ఇంకా ఆమోదం పొందలేదన్నారు. రాజకీయ పరంగా కూడా మహిళలలు 10లోనే ఉన్నారు. ఇంకా మగువలేనిదే మనుగడ లేదు అలాంటి మగువలను ర్యాగింగ్ పేరుతో లైంగిక వేధింపులతో హింసించి ఆత్మ హత్యలు చేసుకునేలా చేస్తున్నారు. కళాశాలలో ర్యాగింగ్లు జరగకుండా విద్యార్థులకి అవగాహన కల్పించాలన్నారు. కింద స్థాయి నుండి కష్టపడే మహిళలను గుర్తించి వారికి అవసరమైన ప్రోతాసహాన్ని ఇవ్వాలన్నారు. కానీ నేటి సమాజంలో ఆడవారి పట్ల కొంత చిన్న చూపు ఇంకా నేటికీ కనపడ్తుందన్నారు. సమాజంలో మహిళలకు కనీస గౌరవము గుర్తింపు ఉండాలి. ఎక్కడ స్త్రీలు పూజింపపడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. ఈ ఒక్క రోజునే మహిళను గుర్తించి వేడుకలు చేసుకొని మిగితా రోజులు మర్చిపోవడం కాదు మహిళాదినోత్సవం అంటే ప్రతీ రోజు కూడా మహిళా దినోత్సవంలా ప్రతి మహిళా విజయం సాధించాలి.