Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా వ్యతిరేక విధానాలను 5న చలో ఢిల్లీ
- వ్యకాస అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ-కల్లూరు
దేశ సంపదను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాలను అణిచి వేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గద్దె దిగే వరకు ఐక్యంగా పోరాటం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. స్థానిక డిఎన్పి ఫంక్షన్ హాల్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకట్ మాట్లాడుతూ ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన సహజ వనరులని కబలించి మన సంపదలను తరలించారన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష పరిపాలన సాధ్యం కాదు కాబట్టి ఆర్థిక ఆధిపత్యం ద్వారా దేశ సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది అంటే అదా అని అంబానీ లకు దోచిపెడుతున్నారు. గుజరాత్ కేంద్రంగా చేసుకొని ఈ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొద్దిపాటి తప్పులు చేస్తేనే కమిటీలు వేసి కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ ప్రధాని మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అదానినే అంబానీ అని అర్థమవుతుందన్నారు. ముఖ్యంగా మన దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి న్యాయవ్యవస్థ ఈడీ, సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకున్నదిని ఆరోపించారు. ఈ దేశంలో అతిపెద్ద అవినీతి కుంభకోణాలు జరుగుతున్నటువంటి బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రం కానీ ఆ రాష్ట్రం జోలికి మాత్రం ప్రధాని పోవట్లేదు అన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీల మీద మాత్రమే దాడులు చేస్తున్నారన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలన్నారు. అదేవిధంగా రైతాంగ సమస్యలను వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు తీసుకొస్తున్నదని ఆరోపించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక చట్టాలుగా తీసుకువచ్చి కార్మికులను కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ రంగాన్ని కూడా నిర్వీర్యం చేస్తుందని దీనికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ కార్మికులు స్థితిగతులు వివరిస్తూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టి కూలీలకు పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశానంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ప్రధాన రహదారిపై దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యక్రమంలో తాళ్లపల్లి కృష్ణ, ఎర్ర శ్రీనివాసరావు, వత్సవాయి జానకి రామయ్య, కె. వెంకటరామిరెడ్డి, బంధం శ్రీనివాసరావు, బంధం రాజ్యం, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తన్నీరు కృష్ణార్జునరావు, గద్దల రత్తమ్మ, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మాదాల వెంకటేశ్వరరావు, ముదిగొండ అంజయ్య, బట్టు నరసింహారావు, సామినేని హనుమయ్య, తదితరులు పాల్గొన్నారు.