Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్మథనంలో ప్రత్యర్థి పార్టీలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువకులు రాజకీయాల్లోకి రావాలి. ఈ మాటలు అన్ని రాజకీయ పార్టీలు అనునిత్యం చెపుతున్నవే. కానీ, ఆచరణలో మాత్రం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా యువ నాయకులకు అవకాశం కల్పించిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. ప్రత్యేకించి భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంతంలో యువకులకు నాయకత్వ బాధ్యతల్ని అప్పజెప్పడం అనేది సాధ్యమైన పని కాదనే చెప్పాలి. కానీ అటువంటి విధానాలకు స్వస్తి చెబుతూ ఏదైతే యువజనులు రాజకీయాల్లోకి రావాలి అని నినాదాన్ని చాటిన మార్క్సిస్ట్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో ఆ పందాలోనే ముందుకు వెళ్తుంది. అనుభవానికి ప్రాధాన్యత గౌరవం కల్పిస్తూనే యువ నాయకత్వానికి పగ్గాలు అప్ప చెబుతుంది. అందులో భాగంగానే భద్రాచలంలో జరిగిన జిల్లా ప్లీనంలో భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్‌గా కారం పుల్లయ్యకి బాధ్యతలు అప్పజెప్పటం యువతపై సిపిఎం వైఖరిని స్పష్టం చేస్తుంది. ఎంతో ఉద్యమ చరిత్ర గల సిపిఎం భద్రాచల నియోజవర్గంలో ముందు నుండి యువతకి ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2018లో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్ని భద్రాచలం నియోజకవర్గాన్ని ముక్కలు చేసి తద్వారా సిపిఐ(ఎం)ని బలహీనపరిచి తాత్కాలిక లబ్ధిని పొందిన విషయం తెలిసిందే. ఆ ఓటమి నుండి గుణపాటాలు నేర్చుకొని పార్టీని నిర్మాణ పరుచుకుంటూ వాజేడు నుండి భద్రాచలం వరకు యువకులకు ప్రాధాన్యతిస్తూ ఆ యువ నాయకత్వానికే బాధ్యతలను కూడా అప్పచెపుతుంది. అందులో భాగంగానే వాజేడు మండల బాధ్యతలు కొప్పుల రఘుపతి, వెంకటాపురం మండల బాధ్యతలు కుమ్మరి శ్రీను, చర్ల మండల బాధ్యతలు కారం నరేష్, దుమ్ముగూడెం కారం పుల్లయ్యతో పాటు భద్రాచలం పట్టణంలో కూడా గడ్డం స్వామికే కార్యదర్శి బాధ్యతలు అప్ప చెప్పి యువకులకే ప్రాధాన్యతను ఇస్తుంది. వాజేడు నుండి భద్రాచలం వరకు ఉన్న ఐదు మండల కార్యదర్శుల వయసు 45 లోపు ఉండటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. వీరుతోపాటు నియోజకవర్గంలో ప్రధాన బాధ్యతలు చూసినటువంటి చర్ల మండలంలో కొలగాని బ్రహ్మచారి దుమ్ముగూడెం లో ఎలమంచిలి వంశీకృష్ణలు కూడా యువకులనే చెప్పాలి. ముందు నుండి కూడా యువకులతో పాటు మహిళలకు సమాన ప్రాధాన్యతలు ఇస్తూ అత్యధిక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అవకాశాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సిపిఎంకే చెల్లుతుందని చెప్పాలి. అంతటితో ఆగకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గ కో కన్వీనర్‌గా సిపిఐ(ఎం) జిల్లా ప్లీనం లో కారం పుల్లయ్యని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించడంతో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అంతర్మదనంలో పడ్డాయని చెప్పాలి. బండారు చందర్రావు, ఎలమంచి సీతారామయ్య స్ఫూర్తితో సున్నం రాజయ్య ఉద్యమ వారసుడిగా సుపరిచితుడైన కారం పుల్లయ్యని భద్రాచల నియోజకవర్గ కో కన్వీనర్ గా ప్రకటించడంతో మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామన్న సిపిఎం వైఖరి స్పష్టమైంది. ఓటమి నుండి క్రమక్రమంగా కోలుకుంటూ పార్టీ సైదాంతికంగా యువకులను పార్టీలో ఇముడుచుకుంటూ ప్రజలకు చేరువవుతూ భద్రాచలం ఏజెన్సీ సమస్యలపై గిరిజన గిరినేతలను ఐక్యం చేస్తూ పోరాటాలు రూపొందించుకుంటూ సిపిఎం ముందు నుండి ఒక ప్రత్యేకత చాటుకుంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గ కన్వీనర్ అయిన మచ్చ వెంకటేశ్వరావుకి సహకారంగా కారం పుల్లయ్యని నియమించడంతో ఆ పార్టీ రాజకీయ వైఖరి స్పష్టమైనది. దుమ్ముగూడెం మండల కార్యదర్శిగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్న కారం పుల్లయ్య పోలవరం వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమంలో 25 రోజులు జైలు జీవితం గడిపి సుమారు 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ కూడా తిరిగిన వారిలో ప్రధముడు పుల్లయ్య. అంతేకాక భద్రాచలం పట్టణంలోని అనేక రకాల సమస్యలపై పోరాడుతూనే నియోజకవర్గ ప్రాంతంలో సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన యువకుడిగా ఉన్న పుల్లయ్యకు నియోజకవర్గ కో కన్వీనర్ బాధ్యతలను ఇవ్వటంతో భద్రాచలం నియోజకవర్గం ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అభ్యుదయవాదులు సిపిఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. యువకులు అంటే నాయకులకు జేజేలు కొడుతూ జండాలు మోయటమే కాదు అవకాశాన్ని ఇచ్చి నాయకులుగా నిలబెట్టాలని సిపిఎం తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ సమస్యలను పరిష్కరించేందుకు యువనాయకత్వానికి బాధ్యతలను అప్పజెపుతున్న సిపిఎం వైపు ప్రజలు చూస్తున్నారు అనటంలో ఎటువంటి అతియోశక్తి లేదు.