Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వైపులా రోడ్లు విస్తరణ
- రూ.23.50 కోట్లకు పరిపాలనా అనుమతి
నవతెలంగాణ-అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట కొత్త సొబగులు అద్దుకోనుంది. ఈ పట్టణ పౌరసమాజం ఎన్నో ఏళ్ళ కల సెంట్రల్ లైటింగ్ ప్రస్తుతం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషితో నెరవేరనుంది. గత రెండు రోజులుగా హైద్రాబాద్లో మకాం వేసిన ఎమ్మెల్యే మెచ్చా నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో పలువురు మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేట-భూర్గంపాహాడ్ రోడ్లో స్థానిక పోలీస్ స్టేషన్ కూడలి నుండి ఒకటిన్నర కిలోమీటర్, ఖమ్మం, దేవరపల్లి రోడ్డులో 119 కి.మి.నుంచి 121 వైలురాయివరకు 2 కి.మి మేర మూడు రోడ్ల కూడలి మీదగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (ట్రస్ట్) నిధుల నుండి రూ.23 కోట్ల 50 లక్షల వ్యయం కోసం పరిపాలనా అనుమతులు కోసం జీఓ విడుదల చేసారు. ఈ నిధులతో నాలుగు లైన్ల రోడ్ విస్తరణ, డీవైడర్ నిర్మాణం, విద్యుదీకరణ, ఇరువైపులా మురికి కాలువల నిర్మాణం, పాదచారుల కోసం పాత్ వే నిర్మిస్తామని ఆర్అండ్బి డీఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రాధమిక ప్రతిపాదనలు మేరకు ఈ నిధులు వ్యయానికి అనుమతి ఇచ్చారని ప్రతిపాదనలు పునఃసమీక్ష అనంతరం ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు.