Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండలంలోని మొండికుంట గ్రామ ఆశ వర్కర్ మండల కృష్ణవేణిని గురువారం మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కరోనా టైంలో ప్రజలకు తాను చేసిన సేవలు గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆశ వర్కర్‌గా గుర్తించి వరంగల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.లక్ష రివార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ తరుపున సర్పంచ్ కృష్ణవేణికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమ నీఆయుధం అయితే విజయం నీ బానిసఅవుతుంది దానికి నిదర్శనమై మన ఆశ వర్కర్ అని, మనం చేసే పని ఎంత చిన్నదైనా పెద్దదైన నిబద్ధతతో పదవికి న్యాయం చేస్తూ వెళ్తే అవార్డులు, రివార్డులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. ఆశ వర్కర్‌కు రాష్ట్రంలో ఉత్తమ అవార్డు రావడం గ్రామ పంచాయతీకి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సైదులు, ఏఎన్ఎం లలిత కుమారి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాలే రామకృష్ణారెడ్డి, కందిమల్ల, సత్తిరెడ్డి, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.