Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-మణుగూరు
ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలని, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా అని, విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. రేగా గురువారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఫేర్ వల్ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ....విద్యావ్యవస్థలో అందుబాటులో ఉన్న వనరులన్నిటినీ సద్వినియోగం చేసుకొని, విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావం తర్వాత కేసీఆర్ వైద్య విద్యకు అధిక ప్రాముఖ్యత కల్పిస్తూ అత్యధిక నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. విద్యార్థులు విద్యాదశ నుంచి క్రమశిక్షణతో ఉండాలన్నారు. అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారు అన్నారు.