Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామయ్య సేవలకు ఆన్ లైన్ అవకాశం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఈ నెల 30న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, 31న పుష్కర పట్టాభిషేక మహౌత్సవానికి భద్రాచలం ముస్తాబ్ అవుతుంది. స్వాగత ద్వారాలు చలవ పందిళ్లు తోపాటు రామాలయానికి రంగుల అద్దుతూ విద్యుత్ అలంకరణలు అధికారులు చేపట్టారు. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాల నుండి రామయ్య కళ్యాణం ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల ఈసారి శ్రీరామనవమికి భక్తులు అంచనాలకు మించి వస్తారని అధికారులు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి 12 సంవత్సరాల తర్వాత జరిగే పట్టాభిషేకానికి పుష్కర పట్టాభిషేకంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఈవో లడ్డూల కౌంటర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాచిపోయిన లడ్డులు విక్రయించారని దేవస్థానం అధికారులపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణం పుష్కర పట్టాభిషేకం ప్రత్యేకంగా తిలకించే అవకాశం లేని భక్తులకి ఆన్లైన్ అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఆన్లైన్ టికెట్ ధర రూ.10వేలు, 5 వేలుగా నిర్ణయించగా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి కళ్యాణపు కండువా ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు కొరియర్ ద్వారా భక్తులకి పంపించడమే కాక వారి పేరు మీద శాస్త్ర గోత్రనామ పూజలు జరిపిస్తారు. సుదీర్ఘ ప్రాంతాలనుండి వచ్చే రామయ్య భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కాటేజీలను మరమ్మతులు చేస్తున్నారు. వాటితో పాటు ప్రధాన కూడలి వద్ద చలివేంద్రాలను ఆలయ అధికారులే ఏర్పాటు చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారుల సైతం ఇప్పటినుంచే పారిశుద్ధ్య పనులు రామాలయ పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు.