Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలో ఢిల్లీ మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలి
- తెలంగాణ రైతు, వ్యవసాయ, సీఐటీయూ నాయకులు పిలుపు
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, పేదల నడ్డి విరుస్తూ తీవ్ర అన్యాయం చేస్తుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మలు విమర్శించారు. గురువారం పాల్వంచ కార్యాలయంలో ఏఐకేఎస్, సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ, మండల ఉమ్మడి సదస్సు కొండబోయిన వెంకటేశ్వర్లు, శెట్టి వినోద, కే.సత్యల అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అందరూ ప్రతిఘటించాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ల సంపద విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై మోయలేని భారం మోపారని అన్నారు. ఉపాధి హామీకి బడ్జెట్లో 29 వేల కోట్ల నిధులు కోత పెట్టడంతో ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న డిల్లీలో కార్మిక, కర్షక సంఘర్షణ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణా రెడ్డి, బొల్లం యాదగిరి, ఎన్నం నాగిరెడ్డి, బాలాద్వి, పద్మ, రమణ, ఎస్.కే.రహీం, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.