Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ అలీనా శాంతి
నవతెలంగాణ-భద్రాచలం
వివక్ష, అసమానతలు లేని సమాజం కోసం కృషి చేద్దామని కిమ్స్ హాస్పిటల్ గ్లైనకాలజిస్ట్ డాక్టర్ అలీనా శాంతి అన్నారు. సీఐటీయూ శ్రామిక మహిళ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో వీవోఏల సంఘం పట్టణ కార్యదర్శి చంద్రలీల అధ్యక్షతన జరిగిన మహిళా దినోత్సవ సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ అంతరిక్షాన్నే యాత్రస్థలంగా మార్చుకుంటూ ముందుకు పోతున్న ఈ సందర్భంలో మహిళగా అనేక అవమానాలు ఎదుర్కొంటూ అసమానతులకు లోనై పుట్టుక నుంచి చావు వరకు, ఇంటి నుంచి సమాజం వరకు వివక్షతకు మహిళలు గురవుతున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంత, లింగ, రంగు, రూపు ఇలాంటి అనేక రూపాలలో వివక్ష కొనసాగుతోందని దీనికి వ్యతిరేకంగా మహిళలందరూ ఉద్యమించాలన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.పద్మ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వ స్కీములలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఈ సమాజంలో అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అటువంటి మహిళలకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. శ్రామిక మహిళల హక్కులు ఈ ప్రభుత్వాలు కాలరాస్తునాయని అన్నారు. మానవ హక్కుల జిల్లా అధ్యక్షురాలు పి.రవి కుమారి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గౌతమి, శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక మాట్లాడుతూ....ఆకాశంలో సగం దేశ సంపద సృష్టించడంలో సగభాగంగా ఉన్న మహిళల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సదస్సులో శ్రామిక మహిళా నాయకులు పి.శివకుమారి, వెంకటలక్ష్మి, శ్యామల పద్మ, సిహెచ్ ధనలక్ష్మి, సీత, స్వప్న, సత్యవేణి, కళావతి, నస్రిన్, లక్ష్మి, జోడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.