Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిఎస్ బిపాస్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి
- నిర్మాణ సామాను తీసుకురావటమే మా పవర్ : కమిషనర్
నవతెలంగాణ-వైరా
మునిసిపాలిటీలో జాతీయ ప్రధాన రహదారి ప్రక్కన స్థలం డాక్యుమెంట్లు, నిర్మాణ అనుమతులు ఏమీ లేకుండా నిర్మించిన షాపులను ఏం చేస్తున్నారని కమిషనర్ అనితను ప్రశ్నించిన విలేకరులకు వింత సమాధానమే లభించింది. ఖమ్మం కార్పొరేషన్, మధిర, సత్తుపల్లి, ఇల్లందు మునిసిపాలిటీలలో నిర్మాణాలు కూల్చిన ఘటన లేదని, టౌన్ ప్లానింగ్ అధికారులను వివరణ కోరితే ముందుగా ఎల్ -1 తరువాత ఎల్ -2కు తెలియ జేయాలని, ఆ తర్వాత టిఎస్ బిపాస్ ద్వారా ఆన్ లైన్ పిర్యాదు చేయాలని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఎల్ -1 ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాల్సి ఉంటుందని తెలిపారు. మునిసిపాలిటీకి ఉండే అధికారాలు ఏమిటని అడిగితే నిర్మాణ సమయంలో నోటీసు లు ఇవ్వటం, నిర్మాణ సామానులు తీసుకురావడమే నని అన్నారు. టిఎస్ బిపాస్ ద్వారా కూడా ఆదేశాలు వచ్చినా 22 రోజుల వ్యవదిలో అక్రమ నిర్మాణ దారులకు మా నిర్మాణం సక్రమమేనని చెప్పుకునే వెసులుబాటు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. వైరా చెరువు బజారులో ఒక కోల్డ్ స్టోరేజ్‌ను సుమారు 15 సంవత్సరాల క్రితం నిర్మించారు. దానికి సుమారు 250 మీటర్ల దూరంలో స్థలానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండి పర్మిషన్ కోసం మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అట్టి స్థలం బఫర్ జోన్లో ఉన్నందున, దానికి నీటి పారుదల శాఖ ఎన్ఓసి ఇవ్వాలని గురువారం మునిసిపల్ అధికారులు పని నిలిపివేసి నిర్మాణ సామానులు తెచ్చారు. మూడు సార్లు నోటీసులు ఇచ్చినా, పనిముట్లు తెచ్చినా అక్రమంగా స్లాబులు పోసిన వారి జోలికి పోలేని నిసహాయ స్థితిలో మునిసిపాలిటీ ఉన్నది. ఇటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉన్నదని, టిఎస్ బిపాస్ పోర్టల్‌లో పిర్యాదు చేస్తే పరిశీలించి 22 రోజుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్ దిగుతుందని మునిసిపల్ అధికారులు కింద నుండి పై వరకూ అందరూ అదే మాట చెబుతున్నారు. ఈలోగా రాజకీయ, అధికారుల అండదండలతో దర్జాగా నిర్మాణాలు పూర్తి చేసి అద్దెలకు ఇచ్చుకునే వెసులుబాటు కల్పిస్తారనే విమర్శలు వినిపిస్తున్నవి. కాగా మునిసిపాలిటీ పాలక వర్గంలోని పెద్దలకు లక్షలకు లక్షలు ముట్ట జెప్పిన మాకు ఏమీ కాదన్న ధీమాతో అక్రమార్కులు ఉన్నట్లు తెలుస్తుంది.