Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్ఏ సండ్ర, కలెక్టర్ గౌతమ్
నవతెలంగాణ-కల్లూరు
పట్నంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం స్థలాన్ని ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్‌లు పరిశీలించారు. గురువారం పట్నంలోని మధిర బ్రాంచ్ కాల్వ పక్కన ఉన్న పాత బస్టాండ్ మొత్తం మూడు ఎకరాలు ఉన్న స్థలంలో భవిష్యత్తులో మున్సిపాలిటీ అయితే భవన నిర్మాణం కోసం స్థలం సరిపోతుందని గ్రామపంచాయతీ సర్పంచ్ లక్కినేని నీరజా రఘు కలెక్టర్ దృష్టికి తీసుకొ చ్చారు. దీంతో ప్రస్తుతం ఉన్న గ్రామపంచాయతీ స్థలాన్ని కూడా పరిశీలించారు. వెజ్ నాన్ వెజ్ ఏర్పాటు కోసం స్థలం సరిపోతుందా లేదా అని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎక్కువగా స్థలం ఉన్నదని అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఎన్ఎస్పి పార్కులో 10 ఎకరాల స్థలం క్వార్టర్స్ కూల్చిన తర్వాత ఉండటంతో ఆ స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ స్థలాల సంబంధించి నివేదిక పంపించాలని తాసిల్దార్, ఆర్డీవోలను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ గురి కాకుండా చుట్టూ ఫెన్సింగ్ చేసి చేయాలని అన్నారు. ఇది ఇలా ఉండగా కలెక్టర్ వచ్చిన సంగతి తెలుసుకొని బెడ్ రూమ్ బాధితులు గ్రామపంచాయతీ కార్యాలయం చేరుకొని కలెక్టర్‌ను అడ్డగించి తమకు న్యాయం చేయాలని నినాదం చేశారు. దీంతో కలెక్టర్ బాధితులను దగ్గరకు పిలిపించుకొని వారి సమస్యను అడిగి తెలుసుకుని అర్హులైన వారందరికీ ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. కొంతమందికి తమకు స్థలం కూడా లేదని చెప్పడంతో అది కూడా చూద్దామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పిటిసి కట్టా అజరు కుమార్, ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ, సర్పంచ్ లక్కినేని నీరజ రఘు, తాసిల్దార్ జంగా బాబ్జి ప్రసాద్, ఎండిఓ రవికుమార్, జల వనరుల శాఖ డిప్యూటీ సర్కిల్ అధికారి అప్పలనాయుడు, ఆర్అండ్బి అధికారులు పిఆర్‌జెఇ వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.