Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-చింతకాని
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. గురువారం చింతకాని మండల రైతు సమన్వయ సమితి నూతన కన్వీనర్ ప్రమాణస్వీకార మహౌత్సవంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ రైతుబంధు రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తూ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి రైతు వేదికల సైతం నిర్మించింది అన్నారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రత్నాకర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజరు కుమార్ సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణయ్య, జడ్పిటిసి కిషోర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, ఖమ్మం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంకాయలపాటి వెంకట లచ్చయ్య, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్లు పాల్గొన్నారు.