Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం పాటిమీగిగుంపు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ధరావత్ బుచ్చా(56) బుధవారం రాత్రి గుండెపోటుతో మతి చెందారు. బుచ్చాకు బుధవారం గుండెపోటు రావటంతో అతనిని ఖమ్మంలో ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని గురువారం పాటిమీదిగుంపుకు తీసుకవచ్చారు. మతదేహంపై సిపిఎం కారేపల్లి మండల కార్యదర్శి కే.నరేంద్ర పార్టీ పతాకాన్ని ఉంచి నివాళ్ళు ఆర్పించారు. బాజుమల్లాయిగూడెం గ్రామ పంచాయితీ వార్డు సభ్యులుగా రెండుసార్లు గెలిచి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావటమే కాకుండా ప్రజా సమస్యలు, పోడు సమస్యలపై సీపీఎం నిర్వహించిన పోరాటాల్లో బుచ్చా ముందున్నాడు. తుది వరకు సీపీఎంలో ఉన్న ఆదర్శ కమ్యూనిస్టు ధరావత్ బుచ్చా అని నాయకులు కొనియాడారు. నివాళ్లు ఆర్పించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శివర్గ సభ్యులు ధరావత్ సైదులు, నాయకులు సూరబార ధనమ్మ, వల్లబోయిన కొండలరావు, ధరావత్ రవికుమార్, వినోద్‌కుమార్, కరపటి రాంబాయమ్మ, సూరబాక సర్వయ్య, మాలోత్ రాంకోటి, షేక్ సైదులు, షేక్ చాంద్‌పాషా, బానోత్ బావుసింగ్ శాంతి, సరిత తదితరులు ఉన్నారు. బుచ్చా కుమారుడు ధరావత్ సంతుకు సానుభూతిని తెలిపారు.