Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
హత్ సే హత్ యాత్రపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సమీక్షా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మండల అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. గురువారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం) లో పిసిసి సభ్యుల, బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో సమీక్షా సమావేశం జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో పాదయాత్ర విజయవంతం అయినదని, జోడో యాత్రకు సంఘీభావంగా జరుగుతున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్రను రెండు(2)నెలల పాటు ప్రతి గడపకు వెళ్లి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత తీయిసుకొనే నిర్ణయాలను వివరిస్తూ,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కార్యక్రమాన్ని చేయాలని, ఇప్పటివరకు అన్ని మండలాలలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఎన్ని గ్రామాలలో జరిగిందని, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా తెలిసికొని జరగని మిగతా గ్రామాలలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మహ్మద్ జావేద్, రాయల నాగేశ్వరారావు, పుచ్చకాయల వీరభద్రం, బైరెడ్డి మనోహర్ రెడ్డి ,శీలం ప్రతాప్ రెడ్డి, మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, బిసి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.