Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కాంట్రాక్ట్ కార్మికులను 12 గంటలు పని చేయకుండా ఎనిమిది గంటలకు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ 2 మహాసభలో కేంద్ర కమిటీ సభ్యులుగా మణుగూరు నుండి వై.రాంగోపాల్, ఆదర్ల సురేందర్, ఏ.ప్రవీణ్, పి.రవి, ఎర్రయ్య ఎన్నికైనట్టు సింగరేణి కాలుష్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. తదితర డిమాండ్లతో భూపాలపల్లిలో జరిగిన మహాసభ తీర్మానం చేసిందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి ఏఐటీయూసీ సిద్ధమవుతుందని అన్నారు.