Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్స్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంట్రన్స్ పరీక్షకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించాలని, ఇన్చార్జి ఆర్సిఓ గురుకులం డేవిడ్ రాజ్ సంబంధిత ప్రిన్సిపాల్లకు ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11 గురుకుల కళాశాలల ప్రిన్సిపాల్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 12న జరిగే సీఓఈ సెట్ ఎంట్రెన్స్ టెస్టులు జరిగే గురుకుల కళాశాలలో ముందస్తు ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థినీ, విద్యార్థులకు పిల్లలు ఎవరు కింద కూర్చొవద్దని, ప్రతి పరీక్షా కేంద్రంలో కుర్చీలు, డ్యూయల్ డెస్క్ బల్లలు ఏర్పాటు చేయాలని, కరెంటు సౌకర్యం, మంచినీరు, మెడికల్ క్యాంపు విద్యార్థులు ఎవరూ ఎండలో కూర్చోకుండా కళాశాల ముందు టెంట్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎంట్రెన్స్ జరిగే పరీక్షా కేంద్రాలలో సంబంధిత ప్రిన్సిపాల్లు పూర్తిస్థాయిలో భద్రత కట్టుదిట్టంగా ఉండాలన్నారు. బయటివారు ఎవరినీ పరీక్ష హాల్లోకి అనుమతించకూడదన్నారు. సీఓఈ సెట్ ఎంట్రన్స్ సంబంధించిన ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ సీట్స్ పరీక్షలు జరిగే కేంద్రాల దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో భద్రపరచడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 11 సెంటర్లలో ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని భద్రాచలం గురుకులం కళాశాలలో-2, ఈఎంఆర్ఎస్ చెర్ల, భద్రాచలం, అంకంపాలెం, సుదిమల్ల, మణుగూరు, దమ్మపేట, యుఆర్జెసి కాలేజీలలో, అలాగే ఎస్ఓఈ ఖమ్మం-2, ఖమ్మం డిగ్రీ కాలేజ్-1, ఈఎంఆర్ఎస్ సింగరేణి-1, ఈ పరీక్షలు జరుగుతాయని, 3560 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కళాశాలలు భద్రాచలం బాలికలు, కిన్నెరసాని దమ్మపేట బాలురు, ఎస్ఓఈ ఖమ్మం బాలురు, ఈ నాలుగు కళాశాలలో ప్రవేశం కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.