Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రముఖ దినపత్రిక 27వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను సింగరేణి డైరెక్టర్ (పా) అండ్ ఫైనాన్స్ ఎన్.బలరాం, డిస్ట్రిక్ట్ జడ్జి పసుపులేటి చంద్ర శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. నిత్వం వార్తల సేకరణలో బిజిగా ఉండే పాత్రికేయులు ఈ పోటీల్లో పాల్గొనడం అనందంగా ఉందని, ఆటల. క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, వినోదం, ఆనందం పెరుగుతుందని చెప్పారు. పత్రికలు నిజాలను నిర్భయంగా బయట పెట్టడంలో తన పాత్ర పోషిస్తోందని, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ఉండి, పోరాడుతోందని, తన వార్త కథనాల ద్వారా అధికారులకు కానరాని సమస్యలను సైతం వెలుగులోకి తీసుకొస్తుందని అభినందించారు. కేవలం వార్తలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పాత్రికేయులతో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ ఒకే వేదికపై కలుసుకొని క్రికెట్ పోటీలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ముఖ్యమైన 8 శాఖల నుండి 8 టీంలు 3 రోజులు తలపడనున్నాయని, కలెక్టరేట్, జుడీషియల్, పోలీసు, డాక్టర్స్, అటవీశాఖ, విద్యాశాఖ, సింగరేణి, ప్రెస్ టీంలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జడ్జి రామారావు, సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ కె.బసవయ్య, దినపత్రిక ఆర్ఎం జోగు వెంకట రత్నం, ప్రెస్ యూనియన్ నాయకులు కల్లోజీ శ్రీనివాస్, ఇమ్మంది ఉదయ్ కుమార్, బి.శంకర్, పాత్రికేయులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.