Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి నాయుడు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవారం సీఐటీయూ, రైతు, వ్యకాస మూడు సంఘాల ఆధ్వర్యంలో చెనుబోయిన బ్రహ్మయ్య, మోరంపూడి కేశవరావుల అధ్యక్షతన మండల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ మతతత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గట్టాలని కోరారు. బీజేపీ పాలనా విధానాలు కార్మికులు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు నష్టం చేసే విధానాలు అమలు పరుస్తోందన్నారు. ఉపాధి హామీ పథకంలో బడ్జెట్లో కోతవిదించిందన్నారు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించిందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని, 44కోడ్లను 4 కోడ్లుగా మార్చిందన్నారు. 8 గంటల పని విధానాన్ని 12, 16గంటలకు తీసుకొచ్చిందని, కార్పోరేట్లకు మేలు చేస్తుందన్నారు. ఇటువంటి ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న ఛలో ఢిల్లీ జయప్రదం చేయాలని కోరారు.
ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దొడాలక్ష్మీనారాయణ, మండలం ఉపాధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, వ్యకాస మండల అధ్యక్షుడు కొలిక్కిపోగు లక్ష్మీనారాయణ, లింగా రెడ్డి, శివశంకర్, కొలికపోగు శ్రీనివాసరావు, కొప్పుల శ్రీనివాస్ రావు, బోగ్యం నరసింహారావు, కొండారు యలమంద, పి.కాంతారావు, జగపతి, కే.వెంకటేశ్వర రావు, రాంప్రసాద్, మల్లాసత్యం, ధర్మయ్య, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.