Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రైటర్స్ బస్తీలోని కేసిఓఏ క్లబ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కె.మునిలా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సేవా అధ్యక్షురాలు హరిణి సత్యనారాయణ, విశిష్ట అతిధిగా జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్సి కె.బసవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.బసవయ్య మాట్లాడుతూ సృష్టిలో ఆడ, మగ వారి వారి విధులకు తగ్గట్టుగా సమానత్వం కలిగి మహిళామణులు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, అన్ని రంగాలలో రాణించాలని కోరారు. హరిణి సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మొదటి గురువు, పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించటంలో తల్లిదండ్రులు తమ పాత్ర పోషించినట్లైతే పిల్లలు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమాలలో సీనియర్ పిఓ శివ కుమార్, ఎస్ఐ రమాదేవి, మల్లెల ఉషారాణి, వాసాల నాగమణి, పుష్పలత, మీనాకుమారి, శ్రీలత, సుజాత, వహీదా, బిందు, రాజేశ్వరి, కళ, స్వర్ణలత, కో-ఆర్డినేటర్ షరీఫ్, సేవా సభ్యులు పాల్గొన్నారు.