Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి
నవతెలంగాణ-పినపాక
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జురుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించడం ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సీబీఐని, ఈడీని ఉపయోగించి బెదెరెంపులకు పాల్పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరిగేలా అనేక సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, మదార్సాహెబ్, సర్పంచ్ గొగ్గలి నాగేశ్వరరావు, గొంది నాగభూషణం, వెంకటనర్సయ్య పాల్గొన్నారు.