Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర నాయకులు కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని వ్యకాస, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం మండల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు రూ.400 ఉన్న ధరను అమాంతంగా గ్రామీణ ప్రాంతాలలో రూ.1200 పెంచి, పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేస్తూ నిత్యవసర ధరలు దేశంలో మోడీ ప్రభుత్వం విపరీతంగా పెంచి ప్రజల ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి లేని భారత్ చేస్తామని చెప్పి, దేశంలో రోజురోజుకు అవినీతి పెట్రేగిపోతుందని అన్నారు. కార్పొరేటీకరణ విధానాలతో కుల, మత, ప్రాంతాల మధ్య కుట్ర చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన మూడు రైతాంగ చట్టాలను తీసుకొవచ్చిందని, ఆ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు దేశ రైతాంగం పోరాటం చేసిందని అన్నారు. 48 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి కార్మిక వర్గాన్ని అధోగతి పాలు చేస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రచారం చేయాలని తెలిపారు. కార్మికులకు ఎనిమిది గంటలుగా పని విధానాన్ని 12 గంటలు అదనపు పని విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగాలు తగ్గించి పని భారం పెంచిందని అన్నారు. కార్మిక, కర్షక, ఐక్యతతో కార్మిక చట్టాలను రక్షించుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. పని దినాలు 200 రోజులకు పెంచాలని రోజు కూలి రూ.600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు పనులు దొరకడం లేదని వ్యవసాయ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దుబ్బ ధనలక్ష్మి, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్, సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, రావుజా, గౌరీ నాగేశ్వరరావు, గొగ్గల ఆదినారాయణ, గోపగాని లక్ష్మీ నరసయ్య, బుగ్గ వెంకట నరసమ్మ, గడ్డం వెంకటేశ్వర్లు, భూక్య సామిని, సంగం అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులను, రైతులను, వ్యవసాయ కార్మికులను, పేదరికంలోకి నెట్టేస్తుందని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏప్రిల్ 5న ఢిల్లీలో జరగబోతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యకాస, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో మండల సదస్సు భయ్యా రాము, బర్ల తిరపతయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి కార్మికులు కనీసం 600 రోజు కూలి ఇవ్వాల్సి జీవోలు చట్టాలు ఉన్న అమలు చేయటం లేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు విస్తరిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డెగ్యల శ్రీను, పుట్టి వెంకటేశ్వర్లు, తోకల రమణయ్య, తోకల అచ్చయ్య, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.