Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ మండల కన్వీనర్ తిరుపతిరావు
నవతెలంగాణ-బూర్గంపాడు
దేశభక్తి ముసుగులో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యానికి రాజ్యంగ సూత్రాలకు వ్యతిరేకంగా అధర్మ పరిపాలన సాగిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలనకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) చేస్తున్న జనచైతన్య యాత్రలను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతిరావు అన్నారు. పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్, ఉప్పులు, పప్పులు తదితర నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరశనగా ఈ నెల 17 నుండి 29 వరకు వరంగల్ నుండి భద్రాచలం మీదుగా సాగే సీపీఐ(ఎం) జన చైతన్య యత్రాను జయప్రదం చేయలని ఆయన అన్నారు. ఈ యాత్రలో రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఆయన పిలుపునిచ్చారు. జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం మోరంపల్లి బంజర, జింకలగూడెం ప్రాంతాలతో ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, అనిల్, శ్రీను పాల్గొన్నారు.