Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
- కార్మికులు, ప్రజల ప్రశంసలు అందుకుంటున్న సీఈ బిచ్చన్న
నవతెలంగాణ-మణుగూరు
వెన్నెల ఆరబోసినంత హాయిగా పచ్చదనం పరిశుభ్రత రంగురంగుల కలయికతో దేదీప్యమానంగా వెలుగులు విరజింపుతుంది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. పచ్చదనం పరిశుభ్రతతో విద్యుత్తు దిపాల వెలుగులో కళకళలాడుతున్న పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా వెలుగుతున్న విద్యుత్ దీపాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. సెక్యూరిటీ మెయిన్ గేట్ ప్రధాన రహదారి అంతా విద్యుత్ వెలుగులు విరజింపుతున్నాయి. ప్రధాన రహదారుల నుండి ఇతర ప్రధాన మార్గాలకు వరకు ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుండి ఈఎస్ పీఎం సీసీ రూమ్ వరకు వెలుగులను విరజింతుంది. మెయిన్ రోడ్డు నుండి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వరకు, యూనిట్ కంట్రోల్ రూమ్ వరకు, బాయిలర్ సైడ్ అంతా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్లాంట్ ఆవరణమంతా హరితహారం పరిశుభ్రతతో కలకలాడుతుంది. వాటర్ ఫౌంటెన్ల మధ్య పచ్చటి మైదానం ఆకర్షణీయంగా ఉంది. చీప్ ఇంజనీర్ బిచ్చన్న ఉదయం నుండి ఒంటిగంట వరకు అధికారులతో సంయుక్తంగా పర్యవేక్షిస్తూ ఎప్పటి పనులను అప్పుడే సమీక్షిస్తూ సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది. పని ప్రదేశాలలోనే ఉంటూ ఎలాంటి సమస్యలు ఎత్తకుండా పర్యవేక్షిస్తున్నారు. అధికారుల సమిష్టి నిర్ణయాలతో ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్లాంటును అన్ని రకాలుగా క్లీనరీ పచ్చదనం పరుచుకున్న హరితహారంతో, వీధి దీపాలతో ప్లాంటును తీర్చి దిద్దుతున్న సీఈ బిచ్చన్నను మణుగూరు, పినపాక సరిహద్దు గ్రామాల ప్రజలు కార్మికులు ప్రశంసిస్తున్నారు. విద్యుత్ వెలుగులను చూసి ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.