Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రతిపక్షాలపై కేసుల దాడి చేస్తూ ప్రజలపై ధరల దాడి చేయటం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. శుక్ర వారం బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో గల జెడ్పీటీసీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగమిస్తున్న విధానం, దేశంలో మిగిలిన ఏ రాష్ట్రాలలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో, సంక్షేమ పథకాలతో కేసీఆర్, బీఆర్ఎస్ ఒక అజేయమైన శక్తిగా ఎదగడాన్ని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ సహించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కొనే దమ్ము లేక తన జేబుసంస్థ ఈడీ ద్వారా ఎమ్మెల్సీ కవితకు సమన్లు పంపారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసి చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.