Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిష్కార స్వభావాన్ని దరఖాస్తుదారునికి తెలపాలి
- జిల్లా కలెక్టర్ అనుదీప్
- అన్ని శాఖల అధికారులకు ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిచితంగా పరిశీలించి, పరిష్కార స్వభావాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలని కలెక్టర్ అనుదీప్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో సుజాతనగర్ మండలం గ్రామానికి చెందిన ఆలీపాక పుల్లమ్మ మండల పరిధిలోని సర్వే నెంబర్ 4/అ/1 నందుగల 0.12 గుంటల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశారు. పరిశీలించిన కలెక్టర్ కొత్తగూడెం ఆర్డీవోకు పరిష్కరించాలని సూచించారు. అలాగే దుమ్ముగూడెం మండలం పేరాయి గూడెం గ్రామానికి చెందిన వాగి ముత్తయ్య సర్వేనెంబర్ 29/1లో తనకు వ్యవసాయ భూమి ఉందని ఆ భూమి సీతమ్మసాగర్‌లో ప్రాజెక్టు కరగట్టు నిర్మాణంలో పోయిందని తనకు పరిహారం ఇప్పించాలని కలెక్టర్‌కు దరఖాస్తు ద్వారా కోరారు. విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలని తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం బోయ తండ గ్రామపంచాయతీకి చెందిన వాంకుడు ఈరి ఆర్వోఎఫ్ఆర్ పట్టవున్న తన రెండు ఎకరాల భూమిలో బోరు వేయించడానికి అనుమతి మంజూరు చేయాలని చేసిన దరఖాస్తులు పరిశీలించిన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇల్లందు తాసిల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామానికి చెందిన బుల్ల నవ్య ఆగస్టు 22, 2021వ తేదీన వివాహం చేసుకున్నారని కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న వయసు తక్కువ ఉందని తిరస్కరించాలని విచారణ నిర్వహించి తన కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరారు. చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ ఓ ఎస్డీకి ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మండలం రామవరం చెందిన లాలాజీ శ్రీనివాస్ జీవో 76 ప్రకారం ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని తనకు పట్ట మంజూరు చేయలేదని దీనిపై విచారణ నిర్వహించి తనకు ఎవరైనా పట్టా మంజూరు చేయించాలని దరఖాస్తు చేశారు దీంతో జిల్లా కలెక్టర్ విచారణ నిర్వహించి తమ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్‌కు చెందిన డి.మహాలక్ష్మి పలుమార్లు ఎస్పీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరుకు దరఖాస్తు చేసుకున్నామని, మంజూరు కాలేదని చిరు వ్యాపారులు చేసుకోవడానికి దళిత బంధు పథకం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఎస్పీ కార్పొరేషన్ ఈడీకి ఎండార్స్ చేశారు. హైదరాబాద్ సాయి నగర్‌కు చెందిన ఆముదాల కౌసల్య తన భర్త కరుణ సాగరం నవంబర్ 7న 2022 మరణించారని పాల్వంచ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 405/16/4లో 2.36 కుంటల అసైన్ పట్టా భూమి కలదని అట్టి భూమిని తప్పుగా భద్రాచలం నుంచి రికార్డుల్లో ఎక్కించారని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తన భూమిని తనకు ఇప్పించాలని తగు చర్యల నిమిత్తం పాల్వంచ తాసిల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.