Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి ఎన్నికల సమావేశం వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
- నెల రోజుల్లో సమస్యల పరిష్కరిస్తాం
- డిప్యూటీసీఎల్సి, జీఎం పర్సనల్ హామీ
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో ఎన్నికల నిర్వహించేందుకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలతో హైదరాబాద్లో నిర్వహించిన సమావేశం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సెప్టెంబర్ 26న జరిగిన ఒప్పందంలోని అన్ని అంశాలను అమలు చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని వారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ సింగరేణిలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికు లకు కూడా ఓటు హక్కు కల్పించాలని, లేదా కాంటాక్ట్ కార్మికులకు ప్రత్యేక ఎన్నికైన నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 2022 సెప్టెంబర్ 26న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ( సెంట్రల్) వద్ద సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీతో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం : డిప్యూటీ సీఎల్సి, జీఎం పర్సనల్ హామీ
ధర్నా చేస్తున్న కార్మికులను, నాయకులను సమావేశంలోకి పిలిచి డిప్యూటీ సీఎల్సీ సింగరేణి యాజమాన్యంతో సమస్యలపై చర్చించారు. సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సెంట్రల్ శ్రీనివాసులు, సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించే విషయమై పర్మినెంట్ కార్మిక సంఘాల అభిప్రాయాలను డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సెంట్రల్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) సింగరేణి యాజమాన్యం, సమావేశంలో పాల్గొన్న పర్మినెంట్ కార్మిక సంఘాల నాయకులకు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై, వారికి ఓటు హక్కు విషయమై వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్య క్రమానికి సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఏ.సమ్మయ్య, సిహెచ్.శ్రీనివాస్, ఆర్.ఆర్.సతీష్, కె.శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించారు.