Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ శ్రామిక మహిళ పట్టణ కన్వీనర్ రేణుక
నవతెలంగాణ-భద్రాచలం
మార్చి 16,17,18 తేదీల్లో జరిగే టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని ఈ సమ్మెలో భాగంగా ఐకెపి ఏపీఎంకు వర్కర్స్‌తో కలిసి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని సీఐటీయూ శ్రామిక మహిళ పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక తెలిపారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ విధానం రద్దు చేయాలని, గ్రామ సంఘాల గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా వీవోఏల ఎకౌంట్లో వేతనాలు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఓఏల యూనియన్ పట్టణ కార్యదర్శి చంద్ర లీల, శ్యామల రామలక్ష్మి, సల్మా, విమల, రాము తదితరులు పాల్గొన్నారు.