Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న మంత్రి, ఎమ్మెల్యే
- ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీపీ
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ ప్రాంతం వాహనం వినియోగదారులు కల నేటికి నెరవేరుతుంది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఏర్పాటు అయిన మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేతులు మీదుగా, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో ప్రారంభించనున్నారు. ఆయన రాక విజయవంతం చేయడానికి ఎంపీపీ శ్రీరామమూర్తి, కాసాని చంద్రమోహన్లు సోమవారం ఏర్పాట్లు పరిశీలిం చారు.కార్యాలయాన్ని ఆర్టీఏ సిబ్బంది ముస్తాబు చేసారు. ఈ కార్యాలయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో వాహన వినియోగదారులకు సేవలు అందించేది. జిల్లాల పునర్విభజనలో అశ్వారావుపేట నియోజక వర్గం భద్రాద్రి కొత్తగూడెంలోకి రావడం ఈ సేవలు కోసం ఈ ప్రాంతం వాహనదారులు జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం వెళ్ళాల్సి వస్తుంది. దూరాభారం, ఆర్ధిక వ్యయంతో ఎంతో వేదనను అనుభవించేవారు. పట్టణ పౌరసమాజం విజ్ఞాపన మేరకు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు అర్జీ పెట్టడంతో ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. దీంతో దూరాభారం తగ్గింది. అశ్వారావుపేట ప్రజలు మంత్రి అజయ్‌కు, ఎమ్మెల్యే మెచ్చాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.