Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని నారాయణరావు పేట గ్రామ పంచాయతీలోని సిరిగుండం గిరిజన గ్రామంలో లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ సంస్థ ఆద్వర్యంలో సోలార్ సిస్టం బోర్ వెల్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.7 లక్షల నిర్మాణ వ్యయంతో ట్యాంకు ఏర్పాటు చేసి కుళాయిన ద్వారా గ్రామస్తులకు స్వచ్చమైన మంచినీటిని అందించే మంచినీటి పధకాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కోరం మాట్లాడుతూ సోలార్ మంచినీటి బోరు ఏర్పాటు చేయడం అభినందనీమన్నారు. ఫాస్టర్ ఉబ్బా యోహాన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ దేవసహాయం, జడ్పీటీసి తెల్లం సీతమ్మ, నారాయణరావుపేట సర్పంచ్ కల్లూరి రజిని, ప్రగళ్లపల్లి, నడికుడి ఎంపీటీసీలు రామారావు, సోడి తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, దళిత సంఘం నాయకులు రాయపూడి ఏసురత్నం నాయకులు ఆదినారాయణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.