Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ బాబురావు
నవతెలంగాణ-చర్ల
మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 19న మండల కేంద్రంలో జరిగే జన చైతన్య యాత్రను, బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ యాత్ర నిర్వహిస్తున్నదని పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 17న హనుమకొండలో యాత్ర ప్రారంభమై 19న చర్ల మండలానికి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు చర్ల బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొంటారని, వేలాదిగా హాజరై జయప్రదం చేయాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయంలో 9 ఏండ్ల పాలల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తుందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను దేశ కార్పొరేట్ కంపెనీలను దోసి పెడుతుందన్నారు. మతవిద్వేషణ రెచ్చగొట్టి దేశ లౌకిక వ్యవస్థ ద్వంసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, మండల కార్యదర్శి కారం నరేష్, మండల కమిటీ సభ్యులు రామారావు పాల్గొన్నారు.