Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా, కలెక్టర్‌కు మెమోరండం అందజేత
నవతెలంగాణ-పాల్వంచ
అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని సీపీఐ(ఎం) పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలు పేదలు పెద్దఎత్తున కలెక్టరేరేట్ ఎదుట ధర్నాకు నిర్వహించారు. నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ అధ్యక్షతన జరిగినసభలో రాష్ట్రకమిటీ సభ్యులు ఏజ్ రమేష్ మాట్లాడుతూ 2018లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు ఆక్రమించి గుడిసెలు వేసుకొని నివాసం ఉన్న స్థలాన్ని అప్పటి తహసీల్దార్ గుడిసేవాసుల దగ్గరకు వచ్చి పార్టీ నాయకులతో మాట్లాడి ఈ స్థలాలు ఖాళీచేస్తే దీంట్లో రెండు పడక గదుల ఇండ్లు కట్టి అర్హులకు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ సందర్బంగా పేదలు పెద్దఎత్తున దరఖాస్తులు ఇచ్చారని వాటికి అతి గతి లేదని ఇప్పటివరకు ఇళ్లే పూర్తికాలేదని, పూర్తి కానీ ఇండ్లకు బూటకపు సర్వేలు చేసి, పేదలకు దక్కాల్సిన ఇండ్లను ధనవంతులకు కట్టబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులకు కేటాయించిన ఇళ్లను రద్దుచేసి పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లను ఆక్రమించి పేదలకు పంచుతామని ఆయన హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు దొడ్డ రవికుమార్ మెమోరండం అందజేసి, జరుగుతున్న అక్రమాలను వివరించారు. తక్షణమే స్పందించి తహసిల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దొడ్డా రవి కుమార్, పట్టణ కమిటీ సభ్యులు వి.వాణి, ఎస్.కె.నిరంజన్, కె.సత్య, తులసిరాం, కాంతి, వెంకటరమణ, గౌసియా, సులోచన, సోమలింగం తదితరులు పాల్గొన్నారు.