Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
- రూ.65లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ములకలపల్లి
2018లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో మండల పరిధిలోని పాతగంగారం మహిళలు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని అడిగారని, అయితే అప్పుడు తాను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏర్పాటు చేయిస్తానని మాట ఇచ్చావరి రూ.65 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజాసమస్యలు పరిస్కరించేది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని, రానున్న ఎన్నికల్లో ఆయనకు అండగా నిలవాలని అన్నారు.
డబుల్ ఇండ్లను సందర్శించిన ఎమ్మెల్యే
మండల పర్యటనలో భాగంగా పాతగంగారం వద్ద డబుల్ ఇండ్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే మహిళలు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెెళ్లారు. దీనికి స్పందించిన మెచ్చా వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి డబుల్ ఇళ్ల సముదాయంలోని ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించడంతో మహిళలు మెచ్చాకు కృతజ్ఞతలు తెలిపారు.
బాధితునికి రూ.3లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేత
మండలం పరిధిలోని సీతాయగూడెం పంచాయతీ సూరంపాలెం గ్రామానికి చెందిన నున్నా నాగబాబు గత కొంతకాలంగా మెడభాగంలో నరాల వ్యాధితో బాధపడుతుండగా వైద్యులను సంప్రదించగా చికిత్స నిమితం రూ.3లక్షలు అవుతాయని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మెచ్చా దృష్టికి తీసుకువెళ్లారు. రూ.3లక్షల ఎల్ఓసీ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మోరం పూడి అప్పారావు, మండల కార్యదర్శి శనగపాటి అంజి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.