Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాలకు సీఎం కేసీఆర్ పేరు
- స్థానిక జూనియర్ కళాశాలను పరిశీలించిన ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఎట్టకేలకు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావు పేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతం ప్రజలు ఎన్నో ఏండ్ల కళ ఫలించును ఉంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అశ్వారావుపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను అభ్యర్థించారు. దీంతో కదిలిన ఆ శాఖ అశ్వారావుపేట డిగ్రీ కళాశాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ప్రాధమిక నివేదిక ఇవ్వాలని పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ చిన్నప్పయ్యకు సూచించింది. ఈ మేరకు ఆయన సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనేక అంశాలతో కూడిన సమాచారాన్ని ఇంచార్జి ప్రిన్సిపాల్ దామెర నరసింహారావును ద్వారా సేకరించారు. పరిశీలినకు వచ్చిన ప్రిన్సిపల్ చిన్నప్పయ్య ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కలిసి ఏర్పాటుకు సుముకం వ్యక్తం చేశారు. కళాశాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేరు పెట్టేవిధంగా ఎమ్మెల్యే అధికారులకు చూసించారు. భవన నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని సహకరించాలని తహసీల్దార్ లూధర్ విల్సన్‌కు ఎమ్మెల్యే చూసించారు. ఈ సందర్భంగా చిన్నప్పయ్య నవతెలంగాణతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా ఉన్నత విద్యాశాఖకు పెట్టిన అర్జీ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు సారం డిగ్రీ కళాశాల ఏర్పాటు సాద్యాసాద్యాలను పరిశీలించడానికి తొలి అడుగుగా ఈ కళాశాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు.