Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడ్ల బండిని ఢ కొట్టిన బొగ్గు లారీ
- ప్రాణాపాయ స్థితిలో మూగజీవాలు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు బీటీపీఎస్ వెళ్లే మార్గమధ్యంలో గుర్ర పెంట వాగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..సోమవారం తెల్లవారుజామున బిజికి సతీష్ అనే రైతు తిర్లాపురం నుండి మణుగూరు వైపు ఎడ్ల బండితో వస్తున్నాడు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నుండి మణుగూరు వైపు వచ్చే టీఎస్ 04 యుబి 8870 బొగ్గు లారీ వెనక నుండి ఢకొట్టింది. బండి చక్రాలు నుజ్జునుజయ్యాయి. బండి ఎద్దులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఎద్దుల కొమ్ములు ఊడిపోయాయి. ఎముకలు విరిగిపోవడంతో జీవచ్ఛవాల రోడ్డుపై పడి ఉండడంతో రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు హృదయాలలో విషాదం నింపింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఫోటోలు తీసుకుని వచ్చారు. ఎద్దును పశువుల ఆసుపత్రికి తరలించకపోవడం విషాదకరం. బీటీపీఎస్కు రైల్వే మార్గం పూర్తి కాకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా బొగ్గు తరలించడం ప్రజలకు పశువులకు దినదిన గండంగా మారిందని, ప్రమాదాలను అరికట్టే వాడే లేడా అని ప్రజలు వాపోతున్నారు.