Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్
- కలెక్టర్‌కు మెమోరండం అందజేత
నవతెలంగాణ పాల్వంచ
ఐటీసీ పేపర్ బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీవోలను వెంటనే సవరించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేసి, సమస్యలతో కూడిన మెమోరాండంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులందరి సంతకాలు సేకరించి కలెక్టర్‌కి అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన జీవోలను ఎప్పటినుండో ఉన్న పాత జీవోలు అమలు చేస్తూ కొత్త జీవోలు అమలు చేయకుండా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మి కుల శ్రమను దోపిడీ చేస్తున్నారని అన్నారు. తక్షణమే జీఓలను వెంటనే సవరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి పాష, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల మధులు పాల్గొన్నారు.
పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి : ఏ.జే.రమేష్
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని అలాగే పెరిగిన ఏరియాస్ వెంటనే విడుదల చేయాలని ఏజే రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనాలు మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.26 వేల ఇవ్వాలని, ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని, అలానే పెరిగిన ఏరియాస్ వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, కే.సత్య, జిల్లా నాయకులు సుల్తానా, నిమ్మల మధు, ఆశష, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.