Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
నవతెలంగాణ-లక్ష్మీదేవిపల్లి
నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడానికి మేమున్నామని భరోసా కల్పించడానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాద యాత్ర చేయనున్నారని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తెలిపారు. సోమవారం లక్ష్మీదేవి పల్లి మండలంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో దేవి ప్రసన్న మాట్లాడారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజరహత్నూర్్ మండలం పిప్పిరి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాలలో 1365 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను ప్లాన్ చేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని ఆరోపించారు. బిజెపి దేశ స్థితిగతులనే పాతాళానికి తొక్కేస్తుందన్నారు. ఈ దేశాన్ని... దేశసమైక్యత కాపాడటానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి మహిళా కాంగ్రెస్ మండల నాయకురాలు భాగ్య, శ్రీదేవి, స్వర్ణకుమారి, పట్టణ మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, మహిళ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, సావిత్రి, చుంచుపల్లి మండలం మహిళ కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి, ఆశ, సుశీల, పాల్వంచ మండల మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.