Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ
- 'లక్ష్మి శ్రీనివాస జ్యూయలరీస్' షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
- ఖమ్మంలో బంగారంతో మెరిసిన రష్మీ
- భారీగా తరలివచ్చిన జన సందోహం
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన 'లక్ష్మీ శ్రీనివాస' జ్యూయలరీస్ షోరూమ్ ను ప్రముఖ నటి, టీవీ యాంకర్ రష్మీతో కలిసి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ నగల వ్యాపారి దుగ్గి శ్రీనివాసరావు నూతనంగా నిర్మించిన వెండి బంగారు ఆభరణాల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టీవీ యాంకర్, కుమారి రష్మీ మాట్లాడుతూ సమాజంలో గౌరవంగా ఉండాలంటే బంగారం ఎంతో ముఖ్యమని, అటువంటి బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి తమ సంపదను పెంచుకోవాలని అన్నారు. గత 25 సంవత్సరాలుగా వెండి బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్న ప్రముఖ వ్యాపారి దుగ్గి శ్రీనివాసరావు సారధ్యంలో నూతనంగా జ్యూయలరీస్ షోరూంను నిర్మించడం అభినందనీయమని అన్నారు. నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా ఉన్న 'లక్ష్మీ శ్రీనివాస జ్యూవెలరీస్' మరో అడుగు ముందుకు వేసి ప్రజలు ముందుకు రావడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నగల వ్యాపారి దుగ్గి శ్రీనివాసరావు మాట్లాడుతూ కస్టమర్ల ఆశయాలకు, అభిరుచులకు అనుగుణంగా వేలాది డిజైన్లతో రూపొందించిన సరికొత్త వెండి, నగల ఆభరణాలు తమ షోరూంలో ఉన్నాయని అన్నారు. మీ సంపదను నగలపై పెట్టడం ద్వారా మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. తాము ఇచ్చే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నటి రష్మీ, నగల వ్యాపారి యాజమాన్య కుటుంబ సభ్యులతో కలిసి 'గున్నా గున్నా మామిడి' అనే పాటకు స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో జ్యూయలరీస్ షోరూం నిర్వాహకులు దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి లక్ష్మి, దుగ్గి అభినవ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, వెండి బంగారు ఆభరణాల వ్యాపారుల సంఘం అధ్యక్షులు బందు సూర్యం, భద్రాద్రి బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.